- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gayatri Gupta: సందీప్ సహాయాన్ని మర్చిపోలేను.. ఒక్క మెసేజ్‌తోనే అన్ని లక్షలు ఇచ్చాడు
గాయత్రీ గుప్తా మాట్లాడుతూ... తన ఆరోగ్య సమస్యల గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఒక మెసేజ్ పెట్టానని, అది చూసిన వెంటనే ఆయన 5.5 లక్షల రూపాయలు పంపినట్లు చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: చాలా విషయాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే గాయత్రీ గుప్తా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితంతో పాటు తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన సహాయం గురించి భావోద్వేగంగా మాట్లాడింది.
గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే నాకు ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా లభించలేదు. ఆ తర్వాత అనేక మానసిక సమస్యలను ఎదుర్కొన్నాను. వాటి ప్రభావంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయి. నా వెన్నుముక కూడా వంగిపోయింది. నేను తీవ్రమైన ఇబ్బందులు పడ్డాను. డాక్టర్లను సంప్రదించినా వారు కూడా నా సమస్యను పూర్తిగా గుర్తించలేకపోయారు. ఎక్కువగా ఆలోచించడం వల్లే ఇలా జరుగుతుందని చెప్పారు. నేను చిన్నప్పటి నుంచే హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకుంటాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడను. అయినా నాకు ఎందుకు ఇలాంటి సమస్యలు వచ్చాయో అర్థం కాలేదు.
నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి దాదాపు 15 లక్షల రూపాయలు అవసరమయ్యాయి. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. దీంతో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించాను. మొదట్లో కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. అలాంటి సమయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు తన ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక అవసరాల గురించి మెసేజ్ పెట్టాను. నా మెసేజ్ చూసిన వెంటనే ఆయన మెడికల్ రిపోర్ట్స్ పంపమన్నారు. నేను పంపిన వారం రోజుల్లోనే 5.5 లక్షల రూపాయలు నా ఖాతాలో జమ చేశారు. ఆయన నిజంగా చాలా గొప్ప వ్యక్తి. నాకు ‘ఫిదా’ సినిమా సమయం నుంచే సందీప్ తెలుసు. ఒక్క మెసేజ్‌తో అంత పెద్ద సహాయం చేశారు అంటూ గాయత్రీ గుప్తా భావోద్వేగానికి గురైంది.






