హన్మకొండలో ప్రీమియర్ షో

by Sujitha Rachapalli |

దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘గత వైభవం’. గత జన్మల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. దీంతో మేకర్స్ తెలుగులో జనవరి 1న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు

హన్మకొండలో ప్రీమియర్ షో
X

దిశ, సినిమా : దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘గత వైభవం’. గత జన్మల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. దీంతో మేకర్స్ తెలుగులో జనవరి 1న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 29న ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు. హన్మకొండలోని ఏసియన్ శ్రీదేవిలో రాత్రి ఏడు గంటలకు ప్రీమియర్ స్టార్ట్ కానుండగా.. టికెట్ బుక్ చేసుకోవాలని కోరుతున్నారు. ఇక సర్వేగర్ సిల్వర్ స్క్రీన్, సునీ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సునీ దర్శకుడు కాగా దీపక్ తిమ్మప్పతో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించాడు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నేతృత్వంలోని ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ ఈ మూవీని తెలుగులో విడుదల చేస్తుంది. నాలుగు విభిన్న కాలాల్లో సాగే ఈ కథలో శివ కుమార్, ఉల్లాస్ హైదర్, రఘు మైసూర్ అందించిన ప్రొడక్షన్ డిజైన్‌తోపాటు భారీ నిర్మాణ విలువలున్నాయి. జుడా శాండీ అందించిన సంగీతం కథలోని భావోద్వేగ, పౌరాణిక అంశాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది.

LINK


Next Story