- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GANDHI TALKS : సినిమా మొత్తం నిశ్శబ్దమే..
ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘గాంధీ టాక్స్’ విడుదల తేదిని అధికారికంగా అనౌన్స్ చేసింది. జనవరి 30న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

దిశ, సినిమా : ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘గాంధీ టాక్స్’ విడుదల తేదిని అధికారికంగా అనౌన్స్ చేసింది. జనవరి 30న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియన్ సినిమాల్లో అరుదైన సైలెంట్ ఫిల్మ్‌గా రూపొందిన ‘గాంధీ టాక్స్’.. కథను వివరించటానికి మాటల కంటే నిశ్శబ్దం బలమైన అంశంగా నిలుస్తుంది. ఇది సినీ ప్రపంచంలో ధైర్యమైన, సృజనాత్మకమైన అడుగుగా ప్రశంసలు అందుకుంటుంది. సినిమాను ఎంత గ్రాండియర్‌గా, ఎలాంటి సౌండ్‌తో రూపొందించారంటూ లెక్కలు వేసే ఈ రోజుల్లో ‘గాంధీ టాక్స్’ సినిమా తన సందేశాన్ని శాంతియుతంగా, ఎలాంటి శబ్దాలు లేకుండా, భావోద్వేగాలతో చెప్పబోతుంది.
ఇందులో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ జాధవ్ వంటి అద్భుతమైన నటీనటులు కీలకపాత్రల్లో కనిపించబోతుండగా.. వీరందరూ తమ హావభావాలతో, నటనతో స్టోరీని అందరికీ తెలియజేస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆయన సంగీతం నెరేటర్‌గా మారుతూ సినిమాలోని డెప్త్‌ను ప్రేక్షకులకు తెలియజేస్తుంది. నిశ్శబ్దాన్ని.. శక్తివంతమైన, మానసిక అనుభవంగా మారుస్తుంది. సినిమాను ప్రపంచ స్థాయిలో కళాకృతిగా నిలబెడుతోంది. దర్శకుడు కిశోర్ బెలేకర్ మాట్లాడుతూ.. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం.. సినిమా కథను చెప్పే వాయిస్‌గా మారిందని.. జీస్టూడియోస్, మీరా చోప్రా సహకారంతో ధైర్యంగా, నిజాయతీగా కొత్త ప్రయత్నాన్ని చేశామని తెలిపాడు.






