Gandhi Talks : శబ్దంతో నిండిన ప్రపంచంలో నిశ్శబ్ద ప్రయత్నం

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-17 14:26:03  IST  )

స్టోరీ టెల్లింగ్‌లో శ‌బ్దంతో నిండిన‌ సినిమా ప్రపంచంలోకి సైలెంట్ ఫిల్మ్‌గా రూపొందిన ‘గాంధీ టాక్స్’ టీజర్ వచ్చేసింది. ఇది నిశ్శ‌బ్దంగానే కాదు.. ధైర్యంగా చేసిన ఓ ప్ర‌య‌త్నంగా కనిపిస్తోంది.

Gandhi Talks : శబ్దంతో నిండిన ప్రపంచంలో నిశ్శబ్ద ప్రయత్నం
X

దిశ, సినిమా : స్టోరీ టెల్లింగ్‌లో శ‌బ్దంతో నిండిన‌ సినిమా ప్రపంచంలోకి సైలెంట్ ఫిల్మ్‌గా రూపొందిన ‘గాంధీ టాక్స్’ టీజర్ వచ్చేసింది. ఇది నిశ్శ‌బ్దంగానే కాదు.. ధైర్యంగా చేసిన ఓ ప్ర‌య‌త్నంగా కనిపిస్తోంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా రూపొందిన టీజర్.. ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో అనేక ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతుంది. ఉద్వేగభ‌రిత‌మైన నిశ్శ‌బ్దంతో కూడిన ఇంటెన్స్ విజువ‌ల్స్ మ‌న‌సుల్లో సంఘ‌ర్ష‌ణ‌ను, అశాంతి, మార్పును సూచిస్తూ.. గాంధీ నిజంగా ఏదో చెప్ప‌బోతున్నాడ‌నే ఆస‌క్తిని క‌లిగిస్తోంది. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ జాధవ్ వంటి టాలెంటెడ్ నటీన‌టులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘గాంధీ టాక్స్’.. కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వంలో తెరకెక్కగా.. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్. రెహమాన్ భావోద్వేగభరిత సంగీతం అందించారు. ప్రతి నిశ్శబ్దం, ప్రతి ఘర్షణ, చెప్పని ఆలోచనలన్నింటికీ సంగీతమే భావోద్వేగ స్వరంగా నిలిచింది. జీ స్టూడియోస్ సమర్పణలో క్యోరియస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, పింక్‌మూన్ మెటా స్టూడియోస్, మూవీ మిల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ అసోసియేష‌న్‌లో రూపొందిన ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story