- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Game Changer: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైన ‘గేమ్ చేంజర్’.. ఏ చానల్‌లో రాబోతుందంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’ (Game Changer). శంకర్ (Shankar) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటించగా.. సముద్రఖని, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. రిలీజ్‌కు ముందుకు ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న థియేటర్స్‌లోకి వచ్చి కేవలం మిక్సిడ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది.
అంతే కాకుండా విడుదలైన నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఇక డిజిటల్ స్ట్రీమంగ్ (Digital streaming) తర్వాత ఇప్పుడు ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్(World Television Premiere)కు సిద్ధం అయింది. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జీ 5 సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 27 సాయంత్రం 5: 30 గంటలకు ప్రసారం కానున్నట్లు తెలిపింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడంతో పాటు టెలివిజన్ ప్రీమియర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రం బృందం.. నెట్టింట పోస్టర్లతో సందడి చేస్తున్నారు. మరి బుల్లితెరపై ‘గేమ్ చేంజర్’కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సి ఉంది.






