2014-2023 వరకు గద్దర్ సినీ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రాలివే

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-30 06:44:32  IST  )

2024 సంవత్సరానికి గాను గురవారం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డలను ప్రకటించిన ప్రభుత్వం ఇవాళ 2014 నుంచి 2023 వరకు తొమ్మిదేళ్ల కాలానికి గాను విజేతలను ప్రకటించారు.

2014-2023 వరకు గద్దర్ సినీ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రాలివే
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 సంవత్సరానికి గాను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డును ప్రకటించిన ప్రభుత్వం ఇవాళ 2014 నుంచి 2023 వరకు తొమ్మిదేళ్ల కాలానికి గాను విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా జ్యూరీ చైర్మన్ మురళిమోహన్ మాట్లాడుతూ.. విభజన నాటి నుంచి నంది అవార్డులు ఇవ్వడం మానేశారని తెలిపారు. పదేళ్లలో సినీ అవార్డులను ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ఏపీలోనూ ప్రభుత్వం సినీ అవార్డులను ప్రకటించాలని కోరారు. ఓకే తెలుగు సినిమాకు రెండు ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదని అన్నారు. రెండు ప్రభుత్వాలు ఒక అవగాహనకు వచ్చి ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం, మరో ఏడాగి ఏపీ ప్రభుత్వం అవ్వార్వుల ఇవ్వాలని సూచించారు.

అనంతరం ఆయన 2014-2023 వరకు గద్దర్ సినీ అవార్డను ప్రకటించారు. 2014 ఉత్తమ మొదటి చిత్రంగా ‘రన్ రాజా రన్’ ఉత్తమ ద్వితీయ చిత్రంగా పాఠశాల, ఉత్తమ తృతీయ చిత్రంగా అల్లుడు శీను నిలిచాయి. 2015 ఉత్తమ చిత్రంగా రుద్రమదేవి, ద్వితీయ చిత్రం కంచె, తృతీయ చిత్రం శ్రీమంతుడు అవార్డులను కైవసం చేసుకున్నాయి. 2016 ఉత్తమ చిత్రంగా శతమానం భవతి, ద్వితీయ చిత్రం పెళ్లిచూపులు, తృతీయ చిత్రం జనత గ్యారేజ్, 2017 ఉత్తమ చిత్రంగా బాహుబలి, ద్వితీయ చిత్రం ఫిదా, తృతీయ చిత్రం అవార్డు ఘాజీని వరించాయి.

ఇక 2018 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా మహానటి, ద్వితీయ చిత్రంగా రంగస్థలం, తృతీయ చిత్రంగా కేరాఫ్ కంచెరపాలెం పురస్కారాన్ని కైవసం చేసుకున్నాయి. 2019కి గాను ఉత్తమ చిత్రంగా మహేశ్ బాబు నటించిన మహర్షి, ద్వితీయ చిత్రంగా జెర్సీ, తృతీయ చిత్రంగా మల్లేశం నిలిచాయి. 2020 సంవత్సరానికి గాను బెస్ట్ మూవీగా అల వైకుఠపురములో.., రెండో బెస్ట్ ఫిల్మ్‌గా కలర్ ఫొటో, తృతీయ చిత్రంగా మిడిల్ క్లాస్ మెలోడీస్, 2021 ఏడాదికి గాను ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్, ఉత్తమ ద్వీతీయ చిత్రంగా అఖండ, తృతీయ చిత్రంగా ఉప్పెన అవార్డులు సొంతం చేసుకున్నాయి. 2022లో బెస్ట్ మూవీగా సీతారామమ్. సెకండ్ బెస్ట్ మూవీగా కార్తికేయా-2, మూడో ఉత్తమ చిత్రంగా మేజర్ నిలిచాయి. 2023లో ఉత్తమ చిత్రంగా బలగం, ద్వీతీయ చిత్రంగా హనుమాన్, తృతీయ ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి గద్దర్ అవార్డును కొల్లగొట్టాయి.

సినీ ఇండస్ట్రీకి అమూల్య సేవలందించిన మహానుభావుల పేరు మీద కూడా అవార్డులను ప్రకటించారు. స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రజాకవి కాళోజీ, ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును నందమూరి బాలకృష్ణ కైవసం చేసుకున్నారు. కాంతారావు అవార్డు విజయ్ దేవరకొండకు, పైడి జయరాజ్ అవార్డ్ మణిరత్నంకు, నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావుకు, సుకుమార్‌కు బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డు, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు యండమూరి వీరేంద్రనాథ్‌కు ప్రదానం చేయనున్నారు.

Next Story