- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘యూనిటీ’ డాక్యుమెంటరీకి గద్దర్ అవార్డు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ - 2025' లో "UNITY - The Man of Social Justice" డాక్యుమెంటరీ మొదటి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా నిలిచింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ - 2025' లో "UNITY - The Man of Social Justice" డాక్యుమెంటరీ మొదటి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా నిలిచింది. సామాజిక బాధ్యత, చారిత్రక నేపథ్యం కలగలిసిన ఈ చిత్రానికిగాను రచయిత, దర్శకుడు విజయ్ కుమార్ బడుగు 'ఉత్తమ డాక్యుమెంటరీ' అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ఈ పురస్కారాన్ని అందజేశారు. గద్దర్ పేరుతో ఇస్తున్న ఈ పురస్కారాల్లో 'యూనిటీ' వంటి అర్థవంతమైన చిత్రం ఎంపిక కావడం హర్షణీయమని మంత్రులు ప్రశంసించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన మహనీయుల చరిత్రను సినిమా రూపంలో భద్రపరచడం అభినందనీయమని విజయ్ కుమార్‌ను కొనియాడారు.
ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ కుమార్ బడుగు మాట్లాడుతూ.. ప్రజా కవి గద్దర్ పేరు మీద తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఒక నిఘంటువు అని, ఆ మహనీయుడి కథను ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం రావడం అదృష్టంగా చెప్పారు. ఈ విజయంలో తనకు అండగా నిలిచిన నిర్మాత చిరందాసు శ్రీకాంత్, ధనుంజయ, ప్రధాన పాత్ర పోషించిన మైమ్ మధు, సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Dadasaheb Phalke International Film Festival) లో 'ఉత్తమ దర్శకుడి' అవార్డు గెలుచుకున్న ఈ చిత్రం, ఇప్పుడు సొంత రాష్ట్రంలో 'గద్దర్ అవార్డు' దక్కించుకోవడంతో సినీ రంగ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.
చిత్ర విశేషాలు:
బ్యానర్: మెగా మేజ్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత: చిరందాసు శ్రీకాంత్, చిరందాస్ ధనుంజయ
రచన, దర్శకత్వం: విజయ్ కుమార్ బడుగు
నటీనటులు: మైమ్ మధు (కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్రలో), మాస్టర్ భాను.
సంగీతం: మార్క్ ప్రశాంత్






