- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Teaser : ఆ హనుమాన్ సపోర్ట్‌తోనే ఈ సినిమా ఇంతటి స్థాయిలో తెరకెక్కింది.. హీరో వైరల్ కామెంట్స్
మైథలాజికల్ జానర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘గదాధారి హనుమాన్’.

దిశ, సినిమా: మైథలాజికల్ జానర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘గదాధారి హనుమాన్’. విరభ్ స్టూడియో బ్యానర్‌పై రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవి కిరణ్ హీరోగా నటిస్తుండగా.. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో
ఈ సందర్భంగా హీరో రవి కిరణ్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన మా నిర్మాతలు బసవరాజ్, రేణుకా ప్రసాద్‌లకు థాంక్స్. మొదట్లో ఈ సినిమాను చాలా చిన్నగా చేయాలని అనుకున్నాం. కానీ ఆ హనుమాన్ ఇచ్చిన సపోర్ట్, శక్తి వల్లే ఈ సినిమాను ఇంతటి స్థాయిలో తెరకెక్కించగలిగాం. క్లైమాక్స్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. మా చిత్రంలో మ్యూజిక్, బీజీఎం, విజువల్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఆయనకు హనుమాన్ అంటే ఇష్టం. ఆ ఇద్దరి ఆశీస్సులు మా సినిమాపై ఉంటాయని భావిస్తున్నాను. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. తారకాసుర చిత్రానికి కన్నడ, తెలుగులో మంచి ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు కూడా ఈ సినిమాను అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే ఈ మూవీని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.






