నాని చేతుల మీదుగా హాయ్ రే..

by Chukka Sudharani |

‘ఇట్లు అర్జున’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘హాయ్ రే’ ఫుల్ సాంగ్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశాడు.

నాని చేతుల మీదుగా హాయ్ రే..
X

దిశ, సినిమా: సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా సరికొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేసి.. తన సొంత నిర్మాణ సంస్థ వాట్ నెక్ట్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమా ద్వారా హీరోగా అనీష్, దర్శకుడిగా మహేష్ ఉప్పల ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. యంగ్ అండ్ క్యూట్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకోగా.. తాజాగా ఫస్ట్ సింగిల్ ‘హాయ్ రే’ ప్రోమో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘కన్ను దాటి జారే నీటీలో.. దాచుకున్న ప్రేమే నువ్వని.. గొంతులోనే ఆగే మాటలో చెప్పుకోని బాధే నువ్వని’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోకు నెట్టింట విశేష స్పందన లభించగా.. తాజాగా ఫుల్ సాంగ్‌ను నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించారు మేకర్స్. ఈ సాంగ్‌తో పాటు పోస్టర్ కూడా నెట్టింట ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.



Next Story