ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ థియేటర్ల వద్ద మహిళల హంగామా!

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-12 08:02:06  IST  )

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ నేడు(జనవరి 12) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ థియేటర్ల వద్ద మహిళల హంగామా!
X

దిశ,వెబ్‌డెస్క్: మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ నేడు(జనవరి 12) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ(Mana Shankara Varaprasad Garu) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక, థియేటర్ల వద్ద చిరంజీవి అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.

ముఖ్యమంగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో చిరంజీవి మాస్ పాటలకు మహిళా అభిమానులు థియేటర్ల ముందు అదిరిపోయే స్టెప్పులేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పండుగ వాతావరణంలో మెగా-వెంకీల మల్టీస్టారర్ మ్యాజిక్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ సినిమా చూసిన అభిమానులు.. వింటేజ్ మెగాస్టార్ లుక్‌తో పాటు, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చేసిందని మెగాస్టార్ ఖాతాలో మరో హిట్ పడిందని మెగా అభిమానులు అంటున్నారు.

READ MORE .....

సంక్రాంతికి థియేటర్‌లో నవ్వుల పండుగ.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ రివ్యూ

Next Story