- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'జాబిలమ్మ నీకు అంత కోపమా' నుంచి ఫోర్త్ సింగిల్ అప్డేట్.. పోస్ట్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) అందరికీ సుపరిచితమే. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) అందరికీ సుపరిచితమే. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తన నటనతో ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఇక ఇతను ప్రజెంట్ హీరోగానే కాకుండా డైరెక్టర్‌గా పలు చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. అలా ‘పవర్ పాండి’(Power Paandi) అనే తమిళ్ మూవీతో ఫస్ట్ టైం దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడో సినిమా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jaabilamma Neeku Antha Kopama).
ఈ చిత్రంలో పవిష్(Pavish) హీరోగా సినీ ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే అనిఖా సురేంద్రన్(anikha Surendran) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దీనిని వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్, కస్తూరి రాజా(Kasthuri Raja) నిర్మిస్తున్నారు. ఇక లవ్ అండ్ కామెడీ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌గా రాబోతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ జి వి ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకుని సినిమాపై మరింత హైప్ పెంచాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి ఫోర్త్ సింగిల్ పుల్ల ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ధనుష్ వ్యక్తిగత విషయానికి వస్తే అతను సూపర్ స్టార్ తనయురాలైన ఐశ్వర్య(Aishwarya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఈ జంటకు యాత్ర(Yatra), లింగ(Linga) అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులకు అప్లై చేశారు. ప్రస్తుతం వీరి కేసు కోర్టు విచారణలో ఉంది.






