నేపాల్‌లో దుమ్ముదులిపేసిన ‘గుంటూరు కారం’ సాంగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-22 12:27:42  IST  )

మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా పాటకు నేపాల్‌లో నలుగురు యువతులు దుమ్ము దులిపేశారు..

నేపాల్‌లో దుమ్ముదులిపేసిన ‘గుంటూరు కారం’ సాంగ్
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు(Super Star Mahesh Babu) నటించిన ‘గుంటూరు కారం’(Guntur Karam) సినిమా తెలుగులో హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కుర్చి మడత పెట్టి సాంగ్(Kurchi Madthapetti Song) మాత్రం ఎల్లలు దటిపోయింది. చిత్రం విడుదలై ఏడాది అయినా పాటకు మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. టాలీవుడ్, బాలివుడ్ అనే తేడా లేకుండా ఓ ఊపు ఊపేసింది. అటు దేశ, విదేశాల్లో కూడా దుమ్మురేపింది.

నేపాల్‌లో కూడా..


తాజాగా నేపాల్‌లో కూడా ఈ పాట అదుర్స్ అనిపించింది. అక్కడి యువతులు కుర్చి మడత పెట్టి సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసి అదరహో అని అనిపించారు. ఇద్దరు యువతులు వేసిన స్టెప్పులు చూసి స్థానికులు ఆశ్చర్య పోయారు. నేపాల్ కాలేజీల్లోనూ, స్కూళ్లలోనూ ఈ పాటతో విద్యార్థులు సందడి చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చూసిన మహేశ్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన గ్లోబల్ స్టార్ అంటే మహేశ్ బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Next Story