- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన నాలుగేళ్ల బంధం.. భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ నటి
నటి శుభ పూంజా.. తన భర్త సుమంత్ బిల్లావా నుండి లీగల్‌గా విడిపోయింది.

దిశ, సినిమా: సినీ సెలబ్రిటీల విడాకుల వార్తలు ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న మనస్పర్థలకే విడాకులు తీసుకుని విడిపోతున్నారు. కొందరు ఆ తర్వాత రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ తన భర్తతో విడిపోయిన వార్త మరువక ముందే.. తాజాగా మరో ప్రముఖ నటి తన భర్తకు విడాకులు ఇచ్చి దూరమైంది. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శుభ పూంజా.. తన భర్త సుమంత్ బిల్లావా నుండి లీగల్‌గా విడిపోయింది. 2022లో వీరిద్దరూ ప్రేమించుకుని, ఇరువైపులా ఉన్న పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్లైన రెండేళ్లకే వీరి మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి, పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.
నటి శుభ పూంజా కెరీర్ విషయానికొస్తే.. ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా 2008లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘మొగ్గినా మనసు’ సినిమాలో ఆమె నటనకు గానూ విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. అంతేకాకుండా, ఈ చిత్రంలో అద్భుతంగా నటించినందుకు ఆమెకు ఉత్తమ సహాయ నటిగా ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా లభించింది. ఎంతో చక్కని కెరీర్ ఉన్న ఈ నటి, ఇలా పెళ్లైన కొద్ది రోజులకే వైవాహిక జీవితంలో విబేధాలు వచ్చి విడాకులు తీసుకోవడం కన్నడ ఇండస్ట్రీతో పాటు ఆమె అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.






