Harihara Veeramallu: మార్చిలో సిని ప్రియులకు పండుగే... ‘హరిహర వీరమల్లు’కు పోటీగా మరో మూడు సినిమాలు రిలీజ్

by Chukka Sudharani |   (  Updated:2025-01-18 16:05:42  IST  )

ఈ ఏడాది సమ్మర్ మూవీ లవర్స్‌కు మంచి అనుభూతి కానుంది.

Harihara Veeramallu: మార్చిలో సిని ప్రియులకు పండుగే... ‘హరిహర వీరమల్లు’కు పోటీగా మరో మూడు సినిమాలు రిలీజ్
X

దిశ, సినిమా: ఈ ఏడాది సమ్మర్ మూవీ లవర్స్‌కు మంచి అనుభూతి కానుంది. ఎందుకంటే.. మార్చి నెలలలో ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్‌కు సిద్ధం అయ్యాయి. వాటిలో..

HHVM: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న వరుస సినిమాల్లో ‘హరి హర వీరమల్లు: పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఒకటి. భారీ బడ్జెట్‌తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తుండగా.. బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. తాజాగా వచ్చిన ఫస్ట్ సింగిల్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీ మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాతో పోటీగా మరో మూడు చిత్రాలు మార్చి 28న రిలీజ్‌కు సిద్ధం అయ్యాయి.

VD12: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రజెంట్ ‘VD12’తో బిజీగా ఉన్నాడు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విజయ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ మూవీని కూడా మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Robinhood: టాలీవుడ్ యంగ్ నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. హిట్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే.. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 20న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ‘రాబిన్‌హుడ్’ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘రాబిన్‌హుడ్’ సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో నితిన్ సివిల్ డ్రెస్ వేసుకున్న స్టైలీష్ పోలీసు ఆఫీసర్‌లా కనిపించారు.

Mad Square: బ్లాక్ బస్టర్ చిత్రం మ్యాడ్‌కి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ వస్తున్న విషయం తెలిసిందే. 2023 లో విడుదలైన ‘మ్యాడ్’ మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో.. ఇప్పుడు వస్తున్న సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా.. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన లడ్డు గానీ పెళ్లి, స్వాతి రెడ్డి పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారడంతో పాటు అన్ని చోట్ల ప్లేలిస్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి. ఇక ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాను 2025 మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఎంతో ఆకర్షణీయంగా ఆకట్టుకుంటోంది.

Read More..

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తొలివారం కలెక్షన్లు ఎన్నంటే?

Next Story