- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చిన నలుగురు మెగా హీరోస్.. ఎంత చూడముచ్చటగా ఉన్నారో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్(వీడియో)
సాధారణంగా బయట మెగా ఫ్యామిలీకు ఉండే క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా బయట మెగా ఫ్యామిలీకు ఉండే క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరికీ ఒక్కో ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే బేసిక్‌గా వీరందరూ ఓకే ఫ్యామిలీ అయినప్పటికి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చాలా రేర్. ఈ క్రమంలో నలుగురు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా గురించి రివ్యూ ఇచ్చాడు. థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన అన్నయ్య కొడుకుపై రివ్యూ ఇవ్వమని మీడియా వారు అడుగగా.. పవర్ స్టార్.. రామ్ చరణ్, శ్రీహరి, కాజల్, రాజమౌళి డైరెక్షన్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక పవన్ పక్కన హీరో చరణ్, చిరంజీవి, నాగబాబు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇక వాటిని చూసిన నెటిజన్లు నలుగురిని ఒకే దగ్గరగా చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






