‘మహిళగా జన్మించడం దేవుడిచ్చిన వరం’.. మాజీ విశ్వసుందరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kodari Anjali |   (  Updated:2025-05-21 14:40:05  IST  )

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘మహిళగా జన్మించడం దేవుడిచ్చిన వరం’.. మాజీ విశ్వసుందరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటి 18 ఏళ్ల వయస్సులోనే విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ నటి INWEC కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన తొలినాళ్ల ప్రదర్శనలు పరిపూర్ణంగా లేవని ఒప్పుకుంది. కాలక్రమేణా తాను తన నైపుణ్యంపై కష్టపడి పనిచేశానని, చివరికి ధ్యానం ద్వారా తన దుర్బలత్వాలను స్వీకరించడం నేర్చుకున్నానని ఆమె పంచుకుంది.

నేడు తాను చాలా మంది కంటే మెరుగ్గా ఉన్నాను అని తెలిపింది. అలాగే ఇందులో స్త్రీకి మీరు ఇచ్చే నిర్వచనమేంటని ప్రశ్న ఎదురవ్వగా.. ఆడవాళ్లగా పుట్టడం దేవుడు ఇచ్చిన వరం అని సుస్మితా సేన్ చెప్పుకొచ్చింది. కాగా ఈ విషయాన్ని మనం అందరం అభినందించాలని వెల్లడించింది. లవ్ అండ్ కేరింగ్ అంటే ఏమిటో ఒక మగాడికి చూపించేది స్త్రీ మాత్రమేనని పేర్కొంది. ఇదే స్త్రీకి నిర్వచనమని తెలిపింది.

దీంతో అక్కడున్న జనాలంతా సుస్మితా సేన్ వ్యాఖ్యలకు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ నటి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక సుష్మితా సేన్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా 2013లో మదర్ థెరిసా అంతర్జాతీయ అవార్డు పొందిన విషయం తెలిసిందే. అలాగే ఈమె రక్షకు, డు అనే సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.

Next Story