ఫోక్‌ సాంగ్‌కు అదిరి పోయే స్టెప్స్‌ వేసిన విదేశీ అన్నా చెల్లెళ్లు.. సూపర్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-15 04:50:23  IST  )

ప్రపంచంలో ఉన్న మట్టిలో మాణిక్యాలు ఇప్పుడు సోషల్ మీడియా(Social media) ద్వారా ప్రపంచానికి పరిచయమవుతున్నారు.

ఫోక్‌ సాంగ్‌కు అదిరి పోయే స్టెప్స్‌ వేసిన విదేశీ అన్నా చెల్లెళ్లు.. సూపర్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఉన్న మట్టిలో మాణిక్యాలు ఇప్పుడు సోషల్ మీడియా(Social media) ద్వారా ప్రపంచానికి పరిచయమవుతున్నారు. అలాంటి వారిలో కిలీపాల్(Kili Paul) ఒకరు. ఆఫ్రికాలోని టాంజానియాకు చెందిన కిలీపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్వతహాగా డాన్సర్ అయిన ఆయన.. కంటెంట్ క్రియేటర్‏గా నెట్టింట దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా అతను భారతీయ సినిమాల్లోని డైలాగ్స్.. పాటలకు డాన్స్ చేస్తూ తెగ ఫేమస్ అయ్యాడు. కేవలం కిలీపాల్ మాత్రమే కాకుండా.. అతని చెల్లెలు నీమా పాల్(Neema Paul) సైతం తన అన్నయ్యతో కలిసి డాన్స్ చేస్తుంది.

వీరికి ఇన్‏స్టాలో ఫాలోవర్స్ కూడా అధికంగా ఉన్నారు. తన డాన్స్ స్టెప్పులతో సెలబ్రిటీ అయి ఫుల్ ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో వీరిద్దరికీ సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా కిలీపాల్ తన సోదరి నీమా పాల్ ఫోక్ సాంగ్ అయినటువంటి కమలాపురం రోడ్డాట.. కాగితాల కంపెనీ పాటకు మాస్ స్టెప్స్ వేశారు. సేమ్ ఈ పాటకు మన తెలుగు ఫోక్ డ్యాన్సర్ ఎలా చేశారో అలాగే అచ్చుగుద్దినట్టు దించేశారు. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story