Malayala Movie: చరిత్రలో మొదటి సారి అలాంటి సినిమా రూ.100 కోట్లకి మించి వసూళ్లు

by Phanindra |   (  Updated:2025-01-18 02:32:25  IST  )

'ఏ' సర్టిఫికెట్‌తో వచ్చిన చిత్రాల్లో రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా ఇప్పటి వరకు ఒక్కటీ కూడా లేదు

Malayala Movie: చరిత్రలో మొదటి సారి అలాంటి సినిమా రూ.100 కోట్లకి మించి వసూళ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు మన ఇండియన్‌ మూవీస్ రూ. 50 కోట్లు, రూ.100 కోట్లు కలెక్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది రూ.1000 కోట్లు కూడా ఈజీగా కలెక్ట్ చేస్తున్నాయి. అయితే, మలయాళ మూవీ " మార్కో"( Marco ) సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియోట్ చేసింది. మేకర్స్ మలయాళ సినీ హిస్టరీ లో మొదటి సారి వంద కోట్ల సినిమా అంటూ పోస్టర్‌ను అధికారికంగా రిలీజ్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది . ఇప్పటి వరకు వంద కోట్లు సాధించిన సినిమాలు ఎన్నో వచ్చినా కానీ, ఈ మూవీ మొదటి వంద కోట్ల మూవీ అనడానికి పెద్ద కారణం ఉంది.

మలయాళ మూవీ ఇండస్ట్రీ ( Malayala industry )నుంచి 'ఏ' సర్టిఫికెట్‌తో వచ్చిన చిత్రాల్లో రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా ఇప్పటి వరకు ఒక్కటీ కూడా లేదు. ఫస్ట్ టైం మార్కో మాత్రమే రూ.100 కోట్లు మించి వసూలు చేసింది. మలయాళ ఇండస్ట్రీలో ఫ్యామిలీ, థ్రిల్లర్‌ సినిమాలను మాత్రమే ఎక్కువగా చూస్తారు. యాక్షన్‌, రొమాంటిక్ మూవీస్ ను చూసిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ హిట్‌ టాక్‌ వచ్చినా వంద కోట్ల మాత్రం రాబట్టలేదు. మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ రేటెడ్‌ వంద కోట్ల సినిమాగా " మార్కో " నిలిచింది.

Next Story