- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajamouli: ఆ కారణం వలన రాజమౌళి, బాహుబలిని మధ్యలో ఆపేద్దాం అనుకున్నారా..?
రాజమౌళి ఈ మూవీని ఇక్కడితో ఆపేద్దామని అన్నారు

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎస్.ఎస్. రాజమౌళి ( Rajamouli ) కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఈయనికి సాటి ఎవరు లేరు. తీసిన ప్రతి మూవీ పక్కా హిట్ అవుతుంది. " మగధీర " చిత్రంతో తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా జక్కన్న పేరు మారు మోగింది. అప్పటివరకు అగ్ర స్థానంలో ఉన్న డైరెక్టర్ శంకర్ ను కూడా రాజమౌళి వెనక్కి నెట్టేశారు. ఇక బాహుబలి సినిమాతో బాలీవుడ్ కూడా టాలీవుడ్ వైపు చూసింది.
బాహుబలి 1, 2 ఎలాంటి విజయాలు సాధించాయో మనకి తెలిసిందే. థియేటర్లలో వేల కోట్ల కలెక్షన్లు వసూలు చేశాయి. ఈ మూవీ తర్వాత ప్రభాస్ ( Prabhas ) పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచుకున్నాడు. ఇదిలా ఉండగా, బాహుబలి సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ చిత్రాన్ని ఆర్క మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ ( Shobu Yarlagadda) , ప్రసాద్ దేవినేని ( Prasad Devineni ) సినిమాను నిర్మించారు. ఇటీవలే ఈయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. " మర్యాద రామన్న తో మంచి విజయం అందుకున్నాము.ఈ చిత్రం తర్వాత బాహుబలి ని తీయాలని అనుకున్నాము. అలాగే ప్లాన్ చేశాము. కానీ, మేము అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొన్నాము, అప్పుడు రాజమౌళి ఈ మూవీని ఇక్కడితో ఆపేద్దామని అన్నారు. కానీ, నేను ఈ చిత్రాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని, ఖర్చు అయినా పర్లేదు సినిమా మాత్రం ఆపకూడదని రిస్క్ చేసి తీశాము. ఆ రోజు తీసుకున్న నిర్ణయమే నేడు ఊహించని విజయం తెచ్చి పెట్టింది. ఇక, బాహుబలి ఎప్పటికీ గుర్తిండి పోతుంది" అంటూ శోభు యార్లగడ్డ తన మాటల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు, ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.






