చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూసాను.. స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by I. Sairam |   (  Updated:2025-02-09 11:26:03  IST  )

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా సినిమా ‘తండేల్’(Thandel).

చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూసాను.. స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా సినిమా ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. అల్లు అరవింద్(Allu aravind) సమర్పణలో బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని చిత్రంపై భారీ అంచనాలు పెంచగా.. సాంగ్స్ మాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

అలా విడుదలకు ముందే క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం శుక్రవారం భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఫస్ట్ షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంటూ దూసుకుపోతుంది. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్‌కి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. అలాగే దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) తన మ్యూజిక్‌తో అదరగొట్టేశాడు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ మూవీ చూసిన వాళ్లు చాలా బాగుంది అని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు(Raghavendra Rao) కూడా తండేల్ మూవీపై స్పందించారు. ఈ మేరకు ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూసాను. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ దాని నేపథ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్ పై దర్శకుడు పెట్టిన శ్రద్ధ బాగుంది. ఈ చిత్రంతో సక్సెస్ అయిన గీతా ఆర్ట్స్ వారికి అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story