- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Peddhi: ‘పెద్ది’ కోసం ఫోక్ సాంగ్.. స్టెప్పులు వేయనున్న యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా వస్తున్న మూవీ ‘పెద్ది’.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా వస్తున్న మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు సనా (Buchibabu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నుంచి ఇప్పటికే గ్లింప్స్ రాగా.. మోగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం డైరెక్టర్ సనా.. అభిమానులకు సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడట.
గతంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేలు రాణి’ మాదిరిగా ఇందులో కూడా ఓ ఫోక్ సాంగ్‌ను సిద్ధం చేస్తున్నాడట. దీని కోసం శ్రీకాకుళానికి చెందిన ఓ ఫేమస్ ఫోక్ సాంగ్‌ని మేకర్స్ రీమిక్స్ చేస్తున్నట్టుగా ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. అందుకున్న సమాచారం మేరకు శ్రీకాకుళం జానపద గేయం మా ఊరి ప్రెసిడెంటు అనే సాంగ్‌ని మేకర్స్ రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తుండగా.. ఈ ఫోక్ సాంగ్‌లో శ్రీలీల స్టెప్పులు వేయనున్నట్లు టాక్. అయితే.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






