- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భగవద్గీతపై ఐదు నిమిషాల ఏఐ షార్ట్‌ఫిల్మ్.. త్వరలో విడుదల
హిందువులకు భగవద్గీతను ఎంతో పవిత్రగా భావిస్తారు.

దిశ, వెబ్ డెస్క్: హిందువులకు భగవద్గీతను ఎంతో పవిత్రగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే భగవద్గీతను ఆధునిక సాంకేతికతతో ప్రజల ముందుకు తీసుకురావడానికి ఓ వినూత్న ప్రయత్నం ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు రామ్ మాధ్వానీ దర్శకత్వంలో రూపొందుతున్న ఐదు నిమిషాల నిడివి గల ఓ ప్రత్యేక ఏఐ షార్ట్ ఫిల్మ్ త్వరలో విడుదల కానుంది. ఇందులో భగవద్గీతలోని మొత్తం 18 అధ్యాయాలను సంక్షిప్తంగా, తాత్వికంగా, భావగర్భితంగా ప్రదర్శించనున్నారు.
ఈ షార్ట్‌ఫిల్మ్ పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో రూపొందించబడుతోంది. దాదాపు 700 శ్లోకాలలో నిండి ఉన్న గీతను సాంకేతికంగా ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకులకు స్పష్టంగా అందించాలనే సాహసోపేతమైన లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.
దర్శకుడు రామ్ మాధ్వానీ మాట్లాడుతూ "భగవద్గీత అనేది ఒక నిత్యసత్య గ్రంథం. దాన్ని ఈ తరానికి చేరువ చేయాలనుకున్నాం. ఏఐ సహాయంతో ప్రతి అధ్యాయంలోని మూల సందేశాన్ని అందించాలనుకుంటున్నాం. ఇది శాస్త్రీయ చింతన, ఆధ్యాత్మికత, సాంకేతికతకి కలయిక."
ఈ షార్ట్‌ఫిల్మ్ భావావేశాలపై, ధర్మ సందిగ్ధతలపై, జీవన గమ్యంపై గీతా బోధనలతో రూపొందించనుండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఉపయోగపడనుంది. ఈ చిత్రం త్వరలో యూట్యూబ్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా విడుదల కానుంది.






