ముందు వీర.. ఆ తర్వాతే గంభీరా.. 'HHVM'కు 'OG' టీమ్ విషెస్

by Gugulothu.Kavitha |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu).

ముందు వీర.. ఆ తర్వాతే గంభీరా.. HHVMకు OG టీమ్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna) కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్(Bobby Deol) విలన్‌గా కనిపించనున్నాడు. అయితే దీనిని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం(AM Rathnam) నిర్మిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు విజేత ఎం ఎం కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్నారు.

కాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూన్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ఓజీ మూవీరను నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ తాజాగా హరిహర వీరమల్లు టీమ్‌కు ఆల్‌ది బెస్ట్ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ముందు వీర.. తర్వాత గంభీర.. జూన్ 12న హరిహర వీరమల్లుని ప్రపంచం చూడటానికి వేచి ఉండలేము’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా జూన్ 12న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

for video click here..

Next Story