వార్-2 నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. రొమాంటిక్ వైబ్‌లో హృతిక్ అండ్ కియారా

by Chukka Sudharani |

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వార్-2’.

వార్-2 నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. రొమాంటిక్ వైబ్‌లో హృతిక్ అండ్ కియారా
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వార్-2’. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండటంతో ఫ్యాన్స్‌లో కూడా ‘వార్-2’పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. ‘వార్-2’ తెలుగు పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది.

దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తన ఇన్‌స్టా వేదికగా.. ‘వార్ 2 నుండి మా మొదటి పాట.. 2 రోజుల్లో విడుదల కానుంది.. కాబట్టి లవ్ అండ్ ఎగ్జైట్మెంట్‌ను మీతో పంచుకుంటున్నాము! హృతిక్ అండ్ కియారా ఫస్ట్ టైమ్ తెరపై కలిసి రాబోతున్నారు. ఈ రొమాంటిక్ సాంగ్ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌లో హృతిక్ అండ్ కియారా వైట్ కలర్ డ్రెస్‌ల్లో క్యూట్ అండ్ రొమాంటిక్‌గా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ రెండు రోజుల్లో అంటే.. కియారా అద్వానీ బర్త్‌డే స్పెషల్‌గా జులై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story