Junior: జూనియర్ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. రొమాంటిక్‌గా ఆకట్టుకుంటోన్న శ్రీలీల, కిరిటీ పోస్టర్

by Chukka Sudharani |   (  Updated:2025-05-17 15:52:42  IST  )

కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి హీరోగా నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘జూనియర్’ (Junior).

Junior: జూనియర్ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. రొమాంటిక్‌గా ఆకట్టుకుంటోన్న శ్రీలీల, కిరిటీ పోస్టర్
X

దిశ, సినిమా: కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి హీరోగా నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘జూనియర్’ (Junior). ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీకి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. జెనీలియా కీలక పాత్రలో నటించి మెప్పించనున్నది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘జూనియర్’ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఇందులో నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు తెలుపుతూ.. ‘‘జూనియర్’ మొదటి సింగిల్ ‘లెట్స్ లైవ్ దిస్ మూమెంట్’ మే 19న విడుదల కాబోతుంది.. దీనికి రాక్ స్టార్ డీఎస్‌పీ సంగీతం అందించారు’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో హీరో కిరిటీ రెడ్డి, హీరోయిన్ శ్రీలీల కలర్స్ పూసుకుని క్యూట్‌గా ఒకనొకరు చూసుకుంటున్నారు.

Next Story