‘రావు బహదూర్’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ప్రేమకు అంకితం ‘ఓ సుందరి’ అంటూ పోస్ట్

by Chukka Sudharani |

‘రావు బహదూర్’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ప్రేమకు అంకితం ‘ఓ సుందరి’

‘రావు బహదూర్’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ప్రేమకు అంకితం ‘ఓ సుందరి’ అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నలేటెస్ట్ చిత్రం ‘రావు బహదూర్’. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఫస్ట్ లుక్, టీజర్ ఆధారంగా ఇది ఒక విభిన్నమైన పీరియడ్ డ్రామా అని, సత్యదేవ్ తన కెరీర్‌లో డిఫరెంట్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ కూల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘ప్రేమకు అంకితం, ప్రేమ నుండే పుట్టిన గీతం ‘ఓ సుందరి’.. ‘రావు బహదూర్’ నుంచి ఫస్ట్ సింగిల్ ఓ సుందరి ఏప్రిల్ 15న విడుదలవుతోంది’ అని తెలిపారు. ఇక విడుదల చేసిన పోస్టర్‌లో హీరో అండ్ హీరోయిన్ లుక్ కూల్‌గా ఆకట్టుకుంటోంది. కాగా.. మహేష్ బాబు, నమ్రత సమర్పిస్తున్న ఈ చిత్రం క్షీణిస్తున్న కులీన వర్గాల నేపథ్యంతో సాగుతుంది. ఇందులో సత్యదేవ్‌తో పాటు దీప థామస్, ఆనంద్ భారతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2026 సమ్మర్ టార్గెటా ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. డేట్ త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.

Next Story