మెగా స్వాగ్‌ను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్

by Chukka Sudharani |

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’.

మెగా స్వాగ్‌ను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్స్‌పై అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. దసరా స్పెషల్‌గా నయనతార శశిరేఖ పాత్రలో నటిస్తున్న గ్లింప్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ కాగా.. నయనతార లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఇదే జోష్‌లో తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ ఫెస్టివల్ స్టార్ట్ చేసినట్లు చెబుతూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు చిరంజీవికి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తూ.. ‘మెగా ఆల్బమ్ లోడ్ అవుతోంది.. మెగా గ్రేస్, మెగా క్లాస్, మెగా స్వాగ్ & మనశంకరవరప్రసాద్ గారు యొక్క మెగా విక్టరీ మాస్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.. మొదటి సింగిల్ ప్రోమో రేపు విడుదల అవుతుంది’ అని తెలిపారు. దీనికి భీమ్స్‌సీసిరోలియో మ్యూజికల్ అందిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. లింక్


Next Story