- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొమ్మ కొమ్మల్లో కోయిల కూయంగ.. ఆకట్టుకుంటోన్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సాంగ్
‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా నుంచి ‘ఊరు సాంగ్’ రిలీజ్ చేశారు మేకర్స్.

దిశ, సినిమా: న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా పరిచయమవుతున్నారు. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా నుంచి ‘ఊరు సాంగ్’ రిలీజ్ చేశారు. సాంగ్ విషయానికి వస్తే.. ‘కొమ్మ కొమ్మల్లో కోయిల కూయంగ, తెల్లవారే మా పల్లె పచ్చపచ్చంగ, ఎచ్చని ఎలుగు సీరే కట్టె సక్కంగ, ముగ్గుల పూలు పెట్టి మెరిసే అందంగ, గడపల తోరణాలే గంతులు వేసెనుగా, పువులా పరిమళాలే గాలులు వీచెనుగా, ముస్తాభవుతున్నాదీ శివరాతిరి పండక్కి ఊరు, చిన్నా పెద్దల్లోన మొదలయ్యెను జాతర జోరు..’ అంటూ ఆహ్లాదకరమైన పల్లెటూరిలో జరిగే శివరాత్రి జాతర సందడిని, ఆ పండక్కి ఊరు ప్రజలంతా సన్నద్ధమయ్యే తీరును వర్ణిస్తూ ఆకట్టుకునేలా సాగుతూ ఆకట్టుకుంటుంది.






