‘కామాఖ్య’ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

by Chukka Sudharani |

అభినయ కృష్ణ, మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ 'కామాఖ్య' నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ 'సఖీ' సాంగ్ రిలీజ్

‘కామాఖ్య’ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
X

దిశ, సినిమా: సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ థ్రిల్లింగ్ చిత్రం ‘కామాఖ్య’. అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు కామాఖ్య మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. ఫస్ట్ సింగిల్ సఖీ పాటని రిలీజ్ చేశారు. ట్యాలెంటెడ్ కంప్జర్ జ్ఞానీ ఈ పాటని ఎప్పటికీ నిలిచిపోయే ఫ్రెండ్షిఫ్ సాంగ్‌గా స్వరపరిచారు. అనంత శ్రీరాం రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. లక్ష్మీ మేఘన వాయిస్ పాటకు మరింత మాధుర్యాన్ని జోడించింది. లిరికల్ వీడియో ఆకట్టుకునే భావోద్వేగాలను, మ్యూజికల్ ట్రీట్‌ని అందిస్తుంది. మొత్తంగా ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Next Story