శ్రీలీల ‘జూనియర్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. మెస్మరైజ్ చేస్తున్న లిరిక్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-27 11:19:40  IST  )

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల (Sreeleela), మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి (Kireeti Reddy)కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘జూనియర్’.

శ్రీలీల ‘జూనియర్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. మెస్మరైజ్ చేస్తున్న లిరిక్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల (Sreeleela), మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి (Kireeti Reddy)కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘జూనియర్’. అయితే ఈ సినిమా రాధాకృష్ణ(Radha Krishna) దర్శకత్వంలో రాబోతుంది. దీనిని వరాహి చలనచిత్ర బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. అయితే ఇందులో కన్నడ సీనియర్ నటుడు రవిచంద్రన్(Ravichandran), జెనీలీయా(Genelia) కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 18న తెలుగు, కన్నడ, హిందీ, తమిళం మరియు మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈక్రమంలో.. జూనియర్ మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. లెట్స్ లివ్ దిస్ మూమెంట్ అనే లిరికల్ వీడియోను షేర్ చేశారు. అయితే రాక స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. జస్ప్రీత్ జాజ్ ఆలపించారు. అయితే ఈ పాట విలాసవంతమైన, రంగురంగుల సెట్‌లపై చిత్రీకరించబడిన విజువల్స్ సంగీతం వలె ఉల్లాసంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ పాట సంగీత ప్రియులను, ముఖ్యంగా యువతను ప్రధానంగా ఆకర్షిస్తుంది. ఇక ఇందులో శ్రీలీల, కిరీటిరెడ్డి కెమిస్ట్రీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.

జీవితం, ప్రేమ, సంగీతం – అన్నిటినీ కలిపే ఫీలింగ్ తో, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జీ ఈ పాటను మరింత రిచ్ గా కంపోజ్ చేశారు . డీఎస్పీ హై ఎనర్జీతో, ఫుట్ టాపింగ్ బీట్‌లతో పాటను కంపోజ్ చేశారు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌తో బ్లెండ్ అయిన ఈ ట్యూన్‌లో యువతను ఆకట్టుకునే విబ్రెన్సీ ఉంది. జస్ప్రీత్ జాజ్ వాయిస్ ఈ పాటకి శక్తినిచ్చింది. శ్రీమణి రాసిన సాహిత్యం ఎమోషన కలిగించేలా ఉంది. విజువల్‌గా ఈ పాటలో కిరీటి, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కిరీటి గ్రేస్‌ఫుల్ డాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంటున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి రూపొందించిన కొరియోగ్రఫీ అదిరిపోయింది. కలర్‌ఫుల్ సెట్స్‌పై గ్రాండ్‌గా చిత్రీకరించిన ఈ పాట విజువల్ గా కూడా అద్భుతంగా కనిపిస్తుంది.

Video Link

Next Story