- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మదరాసి’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. సాంగ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న లిరిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘మదరాసి’(Madarasi).

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Sivakarthikeyan) ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘మదరాసి’(Madarasi). ఏఆర్ మురుగదాస్(AR Murugadas) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తోంది. ఇక ఇందులో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బిజు మీనన్, షబీర్, విక్రాంత్, విద్యుత్ జామ్వాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయినటువంటి ‘సలంబల’ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది.
ప్రస్తుతం ఈ పాట సాంగ్స్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కాగా శివకార్తికేయన్ ఈ చిత్రంతో పాటు ‘పరాశక్తి’(Parasakthi) అనే మూవీలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ అతని కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఇక సుధా కొంగర(Sudha Kongara) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రవి మోహన్(Ravi Mohan) విలన్‌గా నటిస్తున్న ఈ మూవీకు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది పొంగల్‌కి రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.






