Surya : కరుప్పు నుంచి స్పెషల్ అప్డేట్.. గాడ్ మోడ్ ఎక్స్‌పీరియన్స్ చెయ్యడానికి సిద్ధమా అంటూ పోస్ట్

by Chukka Sudharani |

సూర్య, త్రిష లేటెస్ట్ క్రేజీ మూవీ ‘కరుప్పు’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తుండగా.. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Surya : కరుప్పు నుంచి స్పెషల్ అప్డేట్.. గాడ్ మోడ్ ఎక్స్‌పీరియన్స్ చెయ్యడానికి సిద్ధమా అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: సూర్య, త్రిష లేటెస్ట్ క్రేజీ మూవీ ‘కరుప్పు’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తుండగా.. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ తెలిపారు. ఇందులో నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ షేర్ చేశారు. ‘కరుప్పు నుండి మొదటి సింగిల్ ‘గాడ్ మోడ్’ ఎక్స్‌పీరియన్స్ చెయ్యడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ప్రోమో రిలీజ్ చేశారు. అలాగే ఫుల్ సాంగ్ 20-10-2025న రాబోతున్నట్లు తెలిపారు. రిలీజ్ చేసిన పోస్టర్‌లో సూర్య ఓ పెద్ద కత్తిని పట్టుకుని ఉండగా.. చుట్టూ త్రిశూలాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఇది ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. కాగా.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘కరుప్పు’లో.. యోగిబాబు, నట్టి సుబ్రమణియం, శశివాడ కీలక పాత్రలో కనిపించనున్నారు. సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్‌పై నిర్మిస్తున్నారు. లింక్


Next Story