Yamudu: ఆసక్తి రేకెత్తించేలా ‘యముడు’ పోస్టర్..

by Chukka Sudharani |

ప్రస్తుతం మైథలాజికల్ (Mythological) బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటున్నాయి

Yamudu: ఆసక్తి రేకెత్తించేలా ‘యముడు’ పోస్టర్..
X

దిశ, సినిమా: ప్రస్తుతం మైథలాజికల్ (Mythological) బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో మైథలాజికల్ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’ (Yamudu). ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే ఉప శీర్షికతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకోగా.. తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో యుముడి రూపంలో జగదీష్ కనిపించగా.. వెనకాల ఉన్న మహిషాకారం, యముడి చేతికి ఉన్న సంకెళ్లు ఇలా అన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. హీరోయిన్‌ను యమపాశంతో కట్టి పడేసిన తీరు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిందని తెలుస్తుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Next Story