- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమోషన్స్‌తో సూపర్ బజ్.. హ్యాపీ రాజ్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
జివి ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’ ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగులో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

దిశ, సినిమా: కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన చిత్రం ‘హ్యాపీ రాజ్’. స్టార్ హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. ఈ తమిళ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధం అయ్యారు మైత్రి మూవీ మేకర్స్. వారి డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ‘మ్యాడ్’ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిచిన ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో విడుదలై విడుదలైన అప్డేట్స్‌తో మంచి బజ్ క్రియేట్ కాగా.. ఇప్పుడు తెలుగు ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసిన మేకర్స్ రీసెంట్‌గా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కలర్, యాటిట్యూడ్, మాస్ టోన్‌తో అద్భుతమైన ఫస్ట్-లుక్ పోస్టర్‌లో.. జివి ప్రకాష్ కుమార్ కాన్ఫిడెంట్‌గా - నల్లటి సూట్, ఓపెన్-కాలర్ షర్ట్, సన్ గ్లాసెస్ ధరించి, స్ట్రీట్ -స్మార్ట్ గా ఆటో రిక్షా నుండి బయటకు వస్తున్న ఫస్ట్ లుక్ స్టైలిష్‌గా అందరిదృష్టిని ఆకర్షించింది. హ్యాపీ రాజ్ మార్చి 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది.






