Thriller movie: ఉత్కంఠను కలిగించే మర్డర్ మిస్టరీ..

by Chukka Sudharani |

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది.

Thriller movie: ఉత్కంఠను కలిగించే మర్డర్ మిస్టరీ..
X

దిశ, సినిమా: కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా మర్డర్‌ మిస్టరీ (Murder Mystery) జానర్‌ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఇదే కోవలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ (latest thriller movie) ‘తత్వం’ (Tatvam). దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకత్వం వహిస్తున్నాడు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌(First look poster)ను ప్రముఖ దర్శకుడు మారుతి, కల్ట్‌ చిత్రాల నిర్మాత ఎస్‌కేఎన్‌ తమ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసి చిత్రబృందానికి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘మా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసిన మారుతి (Maruti), ఎస్‌కేఎన్‌(SKN)లకు మా ధన్యవాదాలు. పెళ్లి చూపుల కోసమని ఓ గ్రామానికి వెళ్లిన హీరో, ఆ ఊరిలో జరిగిన హత్యల కేసులో ఎలా ఇరుక్కున్నాడు? ఆ కేసుల నుంచి ఎలా బయటపడ్డాడు? ఈ పరిణామాల మధ్యలో అతను తెలుసుకున్న తత్వం ఏమిటి? అనేది ఈ చిత్ర కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా, ఆసక్తిగా ఉంటుంది. ఈతరం ప్రేక్షకులకు కావాలసిన అంశాలతో పాటు.. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు.

Next Story