రవితేజ పవర్‌ఫుల్‌ ప్రాజెక్ట్ 'ఇరుముడి'.. అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

by Sujitha Rachapalli |

మాస్ మహారాజా రవితేజ తన 77వ చిత్రం #RT77 కోసం దర్శకుడు శివ నిర్వాణతో జతకట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

రవితేజ పవర్‌ఫుల్‌ ప్రాజెక్ట్ ఇరుముడి.. అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా : మాస్ మహారాజా రవితేజ తన 77వ చిత్రం #RT77 కోసం దర్శకుడు శివ నిర్వాణతో జతకట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రవితేజ పుట్టినరోజును సందర్భంగా, మేకర్స్ ఈరోజు ఈ చిత్రం టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేశారు

ఈ చిత్రానికి పవర్‌ఫుల్‌ 'ఇరుముడి' అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఇది అయ్యప్ప స్వామి దీక్షని సూచిస్తోంది. అద్భుతమైన ఫస్ట్ లుక్‌లో రవితేజ సాంప్రదాయ అయ్యప్ప మాల దుస్తులు ధరించిన శక్తివంతమైన ఆధ్యాత్మిక అవతార్ లో కనిపించారు. భక్తులతో నిండిన వేడుక ఊరేగింపులో, గొప్ప ఆనందోత్సాహాలతో కనిపించడం ఒక ట్రాన్స్ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. రవితేజ పాపని ఎత్తుకుని చిరునవ్వుతో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య బలమైన బంధం ఉంది, రవితేజకు మునుపెన్నడూ చేయని ఒక విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవర్ అవుతున్నారు.

ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రను పోషిస్తోంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్, ప్రవీణ్ పూడి ఎడిటర్. శివ నిర్వాణ కథ, స్క్రీన్‌ప్లే మరియు సంభాషణలు రాశారు, నరేష్ బాబు పి స్క్రిప్ట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇరుముడి షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Next Story