- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు క్లీంకార ఫేస్ రివీల్.. ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్(పోస్ట్ వైరల్)
టాలీవుడ్ స్టార్ కపుల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)- ఊపాసనల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ కపుల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)- ఊపాసనల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. చాలా ఏళ్లు లవ్ చేసుకున్న ఈ జంట ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అలా మ్యారేజ్ చేసుకున్న చరణ్ - ఉపాసనకు పదేళ్ల తర్వాత క్లీంకార (Klinkara Konidela) జన్మించింది. మెగా వారసురాలు వచ్చిన దగ్గరనుంచి మెగా ఫ్యామిలీ రేంజే మారిపోయింది. అయితే క్లీంకార పుట్టి మూడేళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఆ చిన్నారి ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఈ ప్రిన్సెస్ ఫేస్‌ను ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో క్లీంకార ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా రామ్ చరణ్ సూరత్ లో జరుగుతున్న ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్‌కి అటెంట్ అయ్యాడు. అక్కడ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను చరణ్ మీట్ అయ్యాడు. ఇక ఆ సమయంలో కెమెరాలకు పోజులు ఇచ్చాడు. అప్పుడే చరణ్ ఫోన్ వాల్ పేపర్ కెమెరా కంట పడింది. అందులో క్లీంకార తన తండ్రి చరణ్ మెడపై కూర్చొని క్యూట్‌గా స్మైల్ చేస్తుంది.
వైట్ కలర్ గౌన్‌లో తండ్రి మెడపై కూర్చొని క్లీంకార.. అతని హెయిర్‌తో ఆడుకుంటూ ఉండగా.. చరణ్ కూడా నవ్వుతున్నాడు. అయితే ఫొటో బ్లర్‌గా ఉన్నా కూడా క్లీంకార చాలా ముద్దుగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. సేమ్ క్లీంకార రామ్ చరణ్ అన్నయ్య లాగే ఉందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా క్లీంకార ఫొటోను చూసేయండి.






