- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dude : రూమర్స్‌కు చెక్.. ఫైనల్లీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్
‘డ్రాగన్’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు.

దిశ, సినిమా: ‘డ్రాగన్’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.. ప్రస్తుతం వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘డ్యూడ్’ ఒకటి. కీర్తిశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ.. డేట్ మాత్రం రివీల్ చేయలేదు.
దీంతో.. ఈ సినిమా రిలీజ్‌పై అనే ఊహాగానాలు నెట్టింట దర్శనమిస్తూనే ఉన్నాయి. డ్యూడ్ రిలీజ్‌పై కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు ప్రదీప్ అభిమానులు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 17న రాబోతున్నట్లు తెలుపుతూ.. ‘ఈ దీపావళికి డ్యూడ్ బాణసంచా సెలబ్రేషన్స్ థియేటర్లలో చేసుకుందాం.. ఇప్పుడు అఫీషియల్‌గా వేడుకలు స్టార్ట్ అయ్యాయి.. డ్యూడ్ దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 17న తమిళం & తెలుగులో గ్రాండ్ ఫెస్టివ్ విడుదల కానుంది’ అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లింక్






