Telusu Kada: ఫైనల్ షెడ్యూల్‌కు ‘తెలుసు కదా’..

by Chukka Sudharani |

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’.

Telusu Kada: ఫైనల్ షెడ్యూల్‌కు ‘తెలుసు కదా’..
X

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. ఈ మూవీతో నీరజా కోన దర్శకురాలిగా డెబ్యు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజీ విశ్వ ప్రసాద్, టిజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ చివరి షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో చివరి షెడ్యూల్ జరుగుతోంది.

సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిలపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీంతో సినిమా మొత్తం ప్రొడక్షన్ పూర్తవుతుంది. సైమల్టేనియస్‌గా సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. అంతే కాకుండా.. ఈ నెల నుంచే సినిమా మొదటి పాటను రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్. కాగా.. ఇందులో వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘తెలుసు కదా’ సినిమా ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 17న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

Next Story