- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chota K Naidu: సినిమా సక్సెస్.. ఫెయిల్యూర్ కెమెరామెన్‌కు సంబంధం లేని విషయం
చోటా కె నాయుడు మాట్లాడుతూ... గ్రాఫిక్స్ ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్న సినిమాల హిట్, ఫ్లాప్ వెనుక కెమెరామెన్ పాత్ర ఏమాత్రం ఉండదని సమాధానం ఇచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ కెమెరామెన్ చోటా కె నాయుడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నారు. చోటా కెరీర్లో సీజీ పనులు అత్యధికంగా ఉన్న సినిమాలకు కూడా పనిచేశాడు. అంజి, డమరుకం లాంటి భారీ గ్రాఫిక్స్ వర్క్ ఉన్న సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
తాజాగా ఈ సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో భారీ గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు వస్తున్నాయి, వాటి సక్సెస్, ఫెయిల్యూర్ వెనక కెమెరామెన్ హస్తం ఏమైనా ఉంటుందా? అనే ప్రశ్న చోటాకి ఎదురయింది. దీనికి ఆయన సమాధానం చెబుతూ... సీజీ వర్క్ ఎక్కువ ఉన్న సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్ వెనక కెమెరామెన్ హస్తం ఏమాత్రం ఉండదు. దర్శకుడు వచ్చి ఒక సన్నివేశంలో ఒక ప్లేస్లో లైట్ పెట్టమంటాడు, అది రాంగ్ అని మాకు తెలుసు.
కానీ అలా పెట్టకుంటే రేపు సినిమా విడుదల అయ్యాక బాగో లేకపోయినా, ఒకవేళ సీజీ వర్క్ జరిగే టైంలో ఏ కాస్త తేడా వచ్చినా మమ్మల్ని బ్లెమ్ చేస్తారు. అందుకే మేము గుడ్డిగా వారు చెప్పింది చేస్తాం, దానితో మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్లతో పాటు మరో క్రాఫ్ట్ కూడా జాయిన్ అయింది, అదే సీజీ. నేను ఈ మధ్యకాలంలో సిజి పర్సన్ ఉంటేనే కెమెరా స్విచ్ ఆన్ చేస్తున్నాను, లేదంటే షూటింగ్ చేయడం లేదు. అంతలా గ్రాఫిక్స్ ప్రాధాన్యత తెలుగు సినిమా పరిశ్రమలో పెరిగింది అని ఈయన సమాధానం ఇచ్చాడు.






