- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన పర్సంటేజీ వివాదం.. మెగాస్టార్ జోక్యంపై సెక్రటరి శ్రధర్ ఏమన్నారంటే?
నిర్మాతలకు, థియేటర్ల యాజమాన్యాలకు మధ్య పర్సంటేజ్ షేరింగ్ విషయంలో గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతోన్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: నిర్మాతలకు, థియేటర్ల యాజమాన్యాలకు మధ్య పర్సంటేజ్ షేరింగ్ విషయంలో గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిర్మాతలను, థియేటర్ల యాజమాజన్యాలను సమన్వయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి వరుసగా రెండు రోజులు భేటీలు నిర్వహించి ఈ వివాదానికి ఎట్టకేలకు తెరదించారు. ఇవాళ తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవిని కలిసి.. జూన్ 30 తర్వాత విడుదలయ్యే అన్ని సినిమాలను కేవలం పర్సంటేజీ పద్ధతిలోనే ప్రదర్శించాలని తాము భావిస్తున్నట్లుగా తెలిపారు. దీనిపై స్పందించిన చిరంజీవి పరిశ్రమ హితవు కోరి ప్రస్తుతం ఫిలిమ్ చాంబర్ కమిటీ ఇచ్చిన నివేదిక, మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌కు తెలిపారు. చిరంజీవి ఇచ్చిన సలహాతో ఏకీభవించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజాగా విడుదల కాబోయే రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ ప్రదర్శనను యథావిధిగా పాత పద్ధతి అయిన రెంటల్ విధానంలోనే కొనసాగించేందుకు అంగీకరించారు. అదే సమయంలో, ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా పెద్ద సినిమాకు ప్రభుత్వం టికెట్ ధరలు పెంచితే.. ఆ పెంచిన మొత్తంలో 7.5 శాతం వాటాను ఎగ్జిబిటర్లకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది.
చిరంజీవితో ఎగ్జిబిటర్ల భేటీ అనంతరం తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు మా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాటకు కట్టుబడి ఉంటాము. పెద్ద సినిమాలకు టికెట్ రేటు పెంచిన రెంట్‌తో పాటు 7.5 పర్సెంటేజ్ ఇస్తామన్నారు. అలాగే జూన్ 30లోపు పర్సెంటేజ్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఆక్ష్న హామీ ఇచ్చారు’ అని తెలిపారు.






