- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షమించరాని చర్య.. మా గుండె పగిలిపోయిందంటూ ఉగ్రదాడిపై స్పందించిన సినీ ప్రముఖులు
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam Terror attack)లో మంగళవారం ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam Terror attack)లో మంగళవారం ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి యావత్ భారత దేశాన్ని షాక్‌కి గురి చేసింది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పొయారు. పలువురు గాయపడ్డారు. ఈ పెనువిషాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సినీప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపం తెలుపుతున్నారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఇది క్షమించరాని క్రూరమైన చర్య అని అన్నారు. 'జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందడం చాలా బాధాకరం. ఈ దాడి హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. వారి నష్టం తీర్చలేనిది' అని ట్వీట్ చేశారు.
'పహల్గామ్ దాడిలో మరణించిన వారిని చూస్తుంటే నా హృదయం బరువెక్కుతోంది. ఇప్పడు నా ఆలోచనలు అన్నీ ఆ కుటుంబాల చుట్టే తిరుగుతున్నాయి. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆపై వారి కుటుంబాలకు న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను' అంటూ హీరో ఎన్టీఆర్ పోస్టు పెట్టారు.
'ఎంతో అందమైన ప్రదేశం అయిన పహల్గాంలో జరిగిన ఈ దాడి గురించి తెలిసి నా గుండె ముక్కలయింది. బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. మృతి చెందిన అమాయకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా తెలిపారు.
'ఇది చీకటి రోజు.. పహల్గామ్‌లో జరిగిన దాడితో చాలా బాధపడ్డాను. ఇలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా కలిసి నిలబడే శక్తి మనకు లభిస్తుందని ఆశిస్తున్నాను.. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి' అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
'మూడు నెలల క్రితం మేము అక్కడే ఉన్నాము. దాదాపు 20 రోజుల పాటు 200 మందికి పైగా అక్కడే గడిపాం. పహల్గాం ఒక కలలా ఉంది. ఆ ప్రదేశం మాదిరే అక్కడి ప్రజలను కూడా మరిచిపోలేం. ఈ ఘటన గురించి తలుచుకుంటే గుండె ముక్కలైపోయింది. పంచుకునేందుకు మాటలు కూడా రావడం లేదు' అని హీరో నాని స్పందించారు.






