- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య ఫ్యాన్స్‌కు పండుగలాంటి వార్త.. అఖండ-2 రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandmuri Bala Krishna), బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రాబోతున్న నాలుగో చిత్రం అఖండ-2.

దిశ, వెబ్‌డెస్క్: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandmuri Bala Krishna), బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రాబోతున్న నాలుగో చిత్రం అఖండ-2. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. రామ్ అచంట, గోపీచంద్ అచంటల నిర్మాణంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. అఖండ-2 టీజర్‌తో ఇప్పటికే భారీ సంచలనం సృష్టించి నందమూరి అభిమానుల్లో సరికొత్త జోష్‌ను నింపింది. ఈ అద్భుతమైన స్పందన నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే మూవీ తేదీని అధికారికంగా ప్రకటించింది. అఖండ-2: తాండవంను డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతున్నట్లుగా వెల్లడించారు.
కాగా, బోయపాటి శ్రీను ఈ సీక్వెల్‌ను మరింత భారీ స్థాయిలో గ్రాండ్ సినిమాటిక్ అనుభవంతో రూపొందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన మూవీ పోస్టర్‌లో బాలకృష్ణ లాంగ్ హెయిర్, గడ్డం, అనేక పవిత్రమైన మణులు, ఆభరణాలతో అలంకరించబడిన లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన భారీ త్రిశూలాన్ని ధరించి, సాంప్రదాయ కాషాయం, గోధుమ రంగు వస్త్రాలతో మిథలాజికల్, దైవిక ఇమేజరీని సృష్టిస్తున్నారు. హిమాచ్ఛాదిత, శక్తివంతమైన నేపథ్యం, ఆయన డైనమిక్ పోజ్‌తో కలిసి చిత్ర యొక్క తీవ్రతను, గాంభీర్యాన్ని మరింత హైలైట్ చేస్తుంది. ఎస్. థమన్ రూపొందించిన ఉర్రూతలూగించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రంలోని హై వోల్టేజ్ సన్నివేశాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చనుంది. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి, హర్షలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. కెమెరామెన్లు సినిమాటోగ్రఫీని సి.రాంప్రసాద్, సంతోష్ డి.దేతకే కాగా, ఎడిటింగ్ బాధ్యతలను తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్షన్‌ను ఎఎస్ ప్రకాష్ పర్యవేక్షిస్తున్నారు.






