పండుగ వైబ్స్ విత్ మై విశాఖ క్వీన్.. భార్యతో స్పెషల్ ఫొటో షేర్ చేసిన చైతన్య..(పోస్ట్)

by I. Sairam |

‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య(Akkineni Naga chaitanya) మనందరికీ సుపరిచితమే.

పండుగ వైబ్స్ విత్ మై విశాఖ క్వీన్.. భార్యతో స్పెషల్ ఫొటో షేర్ చేసిన చైతన్య..(పోస్ట్)
X

దిశ, సినిమా: ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య(Akkineni Naga chaitanya) మనందరికీ సుపరిచితమే. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సమంత(Samantha)తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ, పట్టుమని 4 ఏళ్లు కూడా కలిసి ఉండలేక ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు(Divorce) తీసుకుని విడిపోయారు. ఇక డివోర్స్ తర్వాత సమంత మరో పెళ్లి చేసుకోలేదు. మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తోంది. కానీ చైతన్య మాత్రం సామ్‌తో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా పెళ్లి కూడా చేసుకున్నాడు.

ఇక మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడల్లా తన భార్యకు సంబంధించిన ఫొటో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉన్నాడు చైతన్య. ఈ క్రమంలో అతని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా తన ఇన్‌స్టా గ్రామ్‌(Instagram)లో ఓ స్టోరీ పోస్ట్ చేశాడు హీరో నాగ చైతన్య. అందులో ట్రెడిషన్‌లో లుక్‌లో తన భార్యతో కలిసి దిగిన ఫొటో షేర్ చేస్తూ.. ‘పండుగ వైబ్స్ విత్ మై విశాఖ క్వీన్’ అంటూ క్యాప్షన్ జోడించి సంక్రాంతి విషెస్ తెలిపాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వావ్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి మీరు ఈ కపుల్ ఫొటో పై ఓ లుక్ వేసేయండి.

Next Story