- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దసరా రిలీజ్ కోసం స్పీడ్ పెంచిన 'ఫౌజీ' టీమ్
దసరా రిలీజ్‌ను లక్ష్యంగా పెట్టుకుని ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి మెయిన్ కాస్ట్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, సెకండ్ యూనిట్ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఫౌజీ' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా కాలం గడిచింది. ప్రభాస్ ఈ చిత్రంతో పాటు ఇతర ప్రాజెక్టుల షూటింగ్స్‌లో కూడా పాల్గొనడం వల్ల ఈ సినిమా చిత్రీకరణ కొంత నెమ్మదిగానే సాగింది. మొదటి నుంచే ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం షూటింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
దసరా సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ షూటింగ్ స్పీడ్‌ను మరింత పెంచినట్లు సమాచారం. దసరా రిలీజ్‌ను లక్ష్యంగా పెట్టుకుని దర్శకుడు హను రాఘవపూడి మెయిన్ కాస్ట్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, సెకండ్ యూనిట్ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా రెండు యూనిట్లుగా షూటింగ్ నిర్వహిస్తూ చిత్రీకరణను త్వరితగతిన పూర్తి చేసే దిశగా మూవీ బృందం పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






