ఫుల్ స్వింగ్‌లో 'ఫౌజీ'.. లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్

by Pulgam srinivas |

ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ఫౌజీ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో కీలక నటీనటులు పాల్గొంటున్నారని తెలుస్తోంది.

ఫుల్ స్వింగ్‌లో ఫౌజీ.. లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్
X

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌజీ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సాధారణంగా హను రాఘవపూడి ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ క్లాస్ టచ్‌లో ఉంటాయి. అయితే ఈసారి ఆయన తన స్టైల్‌ను మార్చి, ప్రభాస్‌తో కలిసి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 1940ల యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఇందులో అనేక భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్‌కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో కీలక నటీనటులు పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Next Story