- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతా అనుకున్నట్లు జరిగితే.. ‘ఫౌజీ’ అండ్ NTRNeel రిలీజ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న ‘డ్యూడ్’ చిత్రం దీపావళి కాను అక్టోబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుండగా.. ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.

దిశ, సినిమా: ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న ‘డ్యూడ్’ చిత్రం దీపావళి కాను అక్టోబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుండగా.. ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. దీంతో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ & రవి ఫౌజీ అండ్ ఎన్టీఆర్‌నీల్ చిత్రాలపై అప్డేట్ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘ఫౌజీ’. అలాగే.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న ప్రాజెక్ట్ ‘NTRNeel’. ఈ రెండు చిత్రాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా డ్యూడ్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న మైత్రీ నిర్మాతలు ‘అంతా అనుకున్నట్లు జరిగితే ఫౌజీ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము.. అలాగే NtrNeel ని కూడా 2026 లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము’ అని తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ప్రభాస్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Read More..
‘పాయిజన్ బేబీ’కి మిలియన్ వ్యూస్.. నెట్టింట దుమ్మురేపుతోన్న మలైకా, రష్మిక






