ఘోర రోడ్డు ప్రమాదం.. నటుడుకి తీవ్ర గాయాలు, తండ్రి దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-06 04:33:49  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో నటుడికి తీవ్ర గాయాలు కాగా.. తండ్రి దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళనాడు (Tamilnadu)లోని ధర్మపురి (Dharmapuri)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. నటుడుకి తీవ్ర గాయాలు, తండ్రి దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో నటుడికి తీవ్ర గాయాలు కాగా.. తండ్రి దుర్మరణం పాలైన విషాద ఘటన సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko)తో పాటు అతడి సోదరుడు, తండ్రి కలిసి కారులో త్రిస్సూర్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకొట్టై సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చాకో తండ్రి సీపీ చాకో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. చాకోతో పాటు సోదరుడు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ధర్మపురి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Next Story