- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటీనటుల మధ్య ఎఫైర్.. బాంబ్ పేల్చిన డైరెక్టర్..
‘టు మచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్’ షో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వారం గెస్ట్‌గా హాజరైన డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఎప్పటిలాగే షోను హ్యూమరస్‌గా మార్చేసింది. ఎమోషనల్ వర్సెస ఫిజికల్ ఎఫైర్స్ డిబేట్‌ను కామెడీగా మార్చేసింది. అసలు

దిశ, వెబ్ డెస్క్ : ‘టు మచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్’ షో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వారం గెస్ట్‌గా హాజరైన డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఎప్పటిలాగే షోను హ్యూమరస్‌గా మార్చేసింది. ఎమోషనల్ వర్సెస ఫిజికల్ ఎఫైర్స్ డిబేట్‌ను కామెడీగా మార్చేసింది. అసలు నటీనటులు ఎందుకు ఎఫైర్స్ పెట్టుకుంటారో తనకు తెలుసని ఓ ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్పిది. బొమాన్ ఇరానీ నటుడిగా సంజయ భన్సాలీ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో తనను నటించాలని కోరారని.. ప్రతిరోజూ సెట్స్‌లో మోటివేట్ చేస్తానని భన్సాలీ కూడా చెప్పాడని తెలిపింది. దీంతో తాను ‘షిరీన్ ఫర్హాద్ కీ తో నికల్ పడీ’ మూవీలో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలిపింది.
అప్పటి వరకు కొరియోగ్రాఫర్‌గా ఉన్నతాను నటిగా మారానని.. మొదట్లో చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నా తర్వాత షూటింగ్ గ్యాప్‌లో చాలా బోర్ కొట్టేదని తెలిపింది. అప్పుడు అర్థమైంది నటీనటుల మధ్య ఎఫైర్స్ రూమర్స్ ఎందుకు వస్తాయోనని అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. బోర్ కొట్టడం వల్ల వాళ్లు కాస్త క్లోజ్ అవుతారని.. ఎక్కువ సేపు మాట్లాడుకుంటారని.. దీంతో బయట ఎఫైర్ టాక్స్ వస్తాయని తెలిపింది ఫరా.






