- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమన్నాను అవమానించిన జాన్వీ ఫ్యాన్స్... వెనక్కి తోసేసి మరీ!
తమన్నా భాటియాకు ఘోర అవమానం జరిగింది. హీరోయిన్ జాన్వీ కపూర్ ( Janhvi Kapoor) అభిమానులు తమన్నాను... ఇన్సల్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా ( Tamannaah Bhatia ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హ్యాపీ డేస్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ మిల్కీ బ్యూటీ తమన్నా... దాదాపు బడా హీరోలు అందరి సరసన సినిమాలు చేసింది. అంతేకాదు చాలా ఐటెం సాంగ్స్ కూడా ఈ అందాల తార చేసిన సంగతి తెలిసిందే.
అయితే అలాంటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకు ఘోర అవమానం జరిగింది. హీరోయిన్ జాన్వీ కపూర్ ( Janhvi Kapoor) అభిమానులు తమన్నాను... ఇన్సల్ట్ చేశారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో హీరోయిన్ జాన్వీ కపూర్ అలాగే హీరోయిన్ తమన్నా ఇద్దరు ఒకే దగ్గర కనిపించారు. బహుశా ఇద్దరు ఒకే ఫ్లైట్లో ప్రయాణించినట్లు తెలుస్తోంది. అయితే విమానాశ్రయంలో దిగిన తర్వాత... బాలీవుడ్ బ్యూటీ జాన్వి అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
అక్కడే ఉన్న తమన్నాను పట్టించుకోకుండా.. ఆమెను వెనక్కి జరగమని మరీ జాన్వీ కపూర్ తో సెల్ఫీలు దిగారు అభిమానులు. ఇంత జరుగుతున్న జాన్వీ కపూర్ మాత్రం ఏం అనలేకపోయింది. సెల్ఫీలకు ఫోజులిచ్చింది. అనంతరం ఆ ఇద్దరు హీరోయిన్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై తమన్నా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఫ్యాన్స్ కాస్త ఓవర్ చేశారని మండిపడుతున్నారు. క్లిక్






